వైద్య అద్భుతం: నాలుగు నెలల చిన్నారికి అరుదైన కంటి శస్త్రచికిత్స
రిపోర్టర్: అశోక్
స్థలం: Thane
ముంబైలోని జుపిటర్ ఆసుపత్రిలో నాలుగు నెలల చిన్నారికి వైద్యులు అరుదైన మరియు సంక్లిష్టమైన కంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు పీడియాట్రిక్ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మిహిర్ టి. కొఠారి వెల్లడించారు. గతంలో చేసిన కణతి తొలగింపు ఆపరేషన్ వికటించడంతో కంటి కండరం లోపలికి జారిపోయిందని, దీనివల్ల చిన్నారి దృష్టి లోపంతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని, ఎంఆర్ఐ పరీక్షల ద్వారా కండరం కచ్చితమైన స్థానాన్ని గుర్తించి ఆపరేషన్ విజయవంతం చేసినట్లు ఆయన తెలిపారు.