వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన నలుగురు ఎస్ఐలకు వీడ్కోలు

రిపోర్టర్: రమేష్ స్థలం: హన్మకొండ

వరంగల్ పోలీస్ కమిషనరేట్లో వివిధ విభాగాలలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన నలుగురు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లకు పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఘనంగా వీడ్కోలు పలికారు. వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించగా, సుదీర్ఘకాలం పాటు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన అధికారుల సేవలను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులను శాలువాలతో సత్కరించి, వారికి జ్ఞాపికలను అందజేశారు. వారి భవిష్యత్తు ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.