వైరల్ వీడియో కలకలం: ఢిల్లీలో మహిళపై దాడి చేసిన నలుగురి అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో నిరసనకారిణిపై దాడి చేసిన ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఆధారంగా కమలా మార్కెట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రమణ్ సైనీ, వివేకానంద్, కపిల్ కుమార్, రవీందర్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నామని, బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందనప్పటికీ వీడియో ఆధారంగా చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.