ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టి హెచ్చరిక

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ దీటుగా బదులిచ్చింది. ఐరాసలోని భారత శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గహ్లోత్ మాట్లాడుతూ, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం పాక్ కపట నాటకమని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. సైన్యం ఆధిపత్యంలో నడిచే ఆ దేశ నిజస్వరూపాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నడూ మరువదని ఆమె తేల్చిచెప్పారు.