ఈవీఎంల వివాదంపై రాహుల్ గాంధీ తీరును ఎండగట్టిన అమిత్ షా
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని తెలిపారు. ఎన్నికల్ లో పరాజయం ఎదురైనప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఈవీఎంలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించేందుకైనా తాము సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యారని ప్రశ్నించారు.