ఆమనగల్లులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్లు పట్టణ కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ సంఘ సేవకులు, కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఈ వేడుకల్లో పిల్లల కృష్ణ, రాధ వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.