హన్మకొండలో సైబర్ నేరాల నివారణపై వరంగల్ పోలీస్ కమిషనర్ అవగాహన ర్యాలీ
రిపోర్టర్: రాము
స్థలం: హన్మకొండ
సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన మరియు అప్రమత్తతే కీలకమని వరంగల్ సీపీ ఎన్.శ్వేత వెల్లడించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హన్మకొండలోని కేయూ జంక్షన్ నుంచి ప్రత్యేక అవగాహన ర్యాలీని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతమైన చైతన్యం తీసుకురావడానికి పోలీస్ శాఖ తరఫున ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.