స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెదేపా ధ్వజం: గత పాలకులు అన్యాయం చేశారంటూ ఫైర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

గత వైకాపా పాలకులు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అస్తవ్యస్తంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. జనాభా ప్రాతిపదికన పదవులు కేటాయించకుండా ఆ వర్గాలకు అన్యాయం చేశారని తెదేపా పేర్కొంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ తప్పులను సరిదిద్ది, 2011 జనాభా లెక్కల ప్రకారం నిబంధనలు పాటిస్తూ రిజర్వేషన్లు కల్పిస్తోందని, బీసీలకు డెడికేటెడ్ కమిషన్ ద్వారా పూర్తి న్యాయం చేస్తోందని పార్టీ స్పష్టం చేసింది.