అల్లూరి జిల్లాలో కాఫీ పండ్ల సేకరణకు సిద్ధమైన ఏపీఎఫ్డీసీ తోటలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Alluri Sitharama Raju District

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏపీఎఫ్డీసీ కాఫీ తోటల్లో పండ్ల సేకరణ ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు ఆర్వీనగర్ డివిజన్ మేనేజర్ సత్యం తెలిపారు. ఈ ఏడాది సీజన్కు ముందే వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో పండ్లు ముందుగానే పక్వానికి వచ్చాయని పేర్కొన్నారు. నాలుగు వేల హెక్టార్లలో విస్తరించిన ఈ తోటల్లో ప్రస్తుత దిగుబడులపై స్పష్టత కోసం బెర్రీ కౌంట్ ద్వారా నమూనాలు సేకరిస్తున్నామని ఆయన వెల్లడించారు. గతేడాది 175 మెట్రిక్ టన్నుల క్లీన్ కాఫీ ఉత్పత్తి సాధించినట్లు వివరించారు.