తీవ్రవాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం విశాఖపట్నం-గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలతో పాటు ఆకస్మిక వరదలు ముప్పు పొంచి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.