యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక: బ్యాంక్ ఖాతా భద్రత కోసం కీలక సూచనలు జారీ చేసిన ఫోన్పే

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

డిజిటల్ లావాదేవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరాల పట్ల వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్పే స్పష్టం చేసింది. ఖాతాదారుల భద్రత కోసం మూడు కీలక సూచనలను జారీ చేశామని ఫోన్ పే అధికారులు తెలిపారు. డబ్బులు జమ అయ్యేందుకు యూపీఐ పిన్ అవసరం లేదని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.