శ్రీకాకుళంలో తపాలా సమస్యల పరిష్కారానికి రంగంలోకి దిగిన అధికారులు

రిపోర్టర్: JR RAO స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని వినియోగదారుల సమస్యలు మరియు వ్యక్తిగత ఫిర్యాదుల పరిష్కారం కోసం నవంబర్ ఆరున తపాలా అదాలత్ నిర్వహించనున్నారు. డే అండ్ నైట్ జంక్షన్ సమీపంలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. సేవల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై వినియోగదారులు నేరుగా తమ ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్వాహకులు సూచించారు.