సిద్దిపేటపై కాకుండా కేంద్రంపై దండయాత్ర చేయాలన్న హరీష్ రావు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సిద్దిపేట

కాంగ్రెస్ ఎంపీల తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థ ధ్వజమెత్తారు. సిద్దిపేటపై దండయాత్ర చేసినట్లు వస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలు వాస్తవాలు దాచిపెడితే ప్రతిపక్షాలు నిజనిర్ధారణకు వెళ్తాయి కానీ, అధికారంలో ఉండి ప్రభుత్వమే యాత్రలు చేయడం ఏంటని నిలదీశారు. యాత్రల పేరుతో ప్రజాధనాన్ని, ప్రభుత్వ సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దండయాత్ర చేయాల్సింది సిద్దిపేటపై కాదని, కేంద్రంపై చేయాలని హితవు పలికారు.