రేవంత్ సర్కార్ తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: గోపి స్థలం: పెబ్బేరు

జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. నీళ్లు, కరెంటు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతోందని మండిపడ్డారు. పెబ్బేరు పట్టణంలో రైతుల సమస్యలపై నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.