బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు దుమారం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తెలంగాణ
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నారాయణగూడ పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడుతూ, ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.