టేక్రియాల్ శివారులో అదుపుతప్పి బోల్తా పడిన ఆలుగడ్డల లారీ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: కామారెడ్డి
కామారెడ్డి మండలం టేక్రియాల్ శివారులో బైపాస్ రోడ్డుపై ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి. నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.