రేస్కోర్స్ తొలగింపు నిర్ణయంపై కేంద్రమంత్రి కిరెన్ రిజిజుకు అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: New Delhi / National
రేస్కోర్స్ వద్ద ఉన్న చారిత్రాత్మక మసీదును ఖాళీ చేయించే ప్రయత్నాలను AIMIM అధినాయకులు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి కిరెన్ రిజిజు తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మసీదుకు సంబంధించిన విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ముస్లింల ప్రార్థనా స్థలాలను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేస్తూ డిమాండ్ చేశారు.