రోలుగుంట జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా బంటు చిరంజీవి దాదాపు ఖరారు
రిపోర్టర్: G TAMMUNAIDU
స్థలం: రోలుగుంట
రోలుగుంట మండలంలో కూటమి పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థి రేసులో కొండపాలెంకు చెందిన బంటు చిరంజీవి నిలిచారు. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మాజీ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది.