హైదరాబాద్లో నకిలీ యాపిల్ ఉత్పత్తుల విక్రయం గుట్టురట్టు: నిందితుడు అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

నకిలీ యాపిల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు విక్రయిస్తున్న మోసగాడిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. నకిలీ ఐఫోన్లను అసలైనవిగా నమ్మిస్తూ ప్రజలను మోసగిస్తున్న ఇరవై ఆరు సంవత్సరాల నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో రెండు ఐఫోన్లు, నాలుగు స్మార్ట్వాచ్లు, ఏడు ఇయర్బడ్లను స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు స్పష్టం చేశారు.