ది వ్వాన్ ట్రైలర్ కాపీరైట్ వివాదం సర్దుమణిగింది
రిపోర్టర్: రాము
స్థలం: భారతదేశం
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ది వ్వాన్ ది ఫారెస్ట్ చిత్ర ట్రైలర్‌లో తన అనుమతి లేకుండా ఐగిరి నందిని పాటను వాడారంటూ సంగీత దర్శకుడు సర్గమ్ వైష్ ఆరోపించిన నేపథ్యంలో వివాదం సమసిపోయింది. ఈ వ్యవహారంపై బాలాజీ మోషన్ పిక్చర్స్ లీగల్ టీమ్ వెంటనే స్పందించి సర్గమ్ వైష్‌ను కలిసి సదరు ట్రాక్‌కు సంబంధించిన సింక్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. అయితే ఈ రికార్డింగ్ ఎలా లీక్ అయిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.