ముఖ్యమంత్రి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారంటూ గోవిందన్ ఆరోపణ

రిపోర్టర్: సతీష్ స్థలం: తిరువనంతపురం

సీఎంఆర్ఎల్ ఎక్సలాజిక్ వివాదం ద్వారా ముఖ్యమంత్రి పరయి విజయన్‌ను టార్గెట్ చేశారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయ కక్షసాధింపు చర్యలను మొదటి నుంచీ ఖండిస్తున్నామని, ప్రజాక్షేత్రంలో బలమైన నిరసనలు తెలుపుతామని ఆయన స్పష్టం చేశారు.