తాగునీరు ఇవ్వాలంటూ విశాఖలో మహిళల రోడ్డు నిరసన
రిపోర్టర్: కిరణ్
స్థలం: Visakhapatnam
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చడంతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టి, గొంతు తడుపుకునేందుకు కనీసం నీరు కూడా ఇవ్వలేరా అంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.