చిన్నారులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విద్యపై ప్రత్యేక అవగాహన ముఖ్యం: సీతక్క

రిపోర్టర్: కృష్ణ స్థలం: ములుగు

చిన్నారులకు చిన్ననాటి నుంచే సరైన ప్రవర్తనపై అవగాహన కల్పించాలని దనసరి అనసూయ (సీతక్క) - మంత్రి, ములుగు ఎమ్మెల్యే పేర్కొన్నారు. లేత మనసులపై పడే ముద్రలు జీవితాంతం ప్రభావం చూపుతాయని ఆమె స్పష్టం చేశారు. సరైనది ఏమిటో, తప్పు ఏమిటో పిల్లలకు చిన్న వయసులోనే నేర్పించాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశాలపై తప్పనిసరిగా విద్యనందించాలని ఆమె కోరారు. చిన్నారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా మార్గదర్శనం చేయాలని మంత్రి సూచించారు.