బ్యాడ్మింటన్ లో పీవీ సింధు, లక్ష్యసేన్ అద్భుత విజయం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: జర్మనీ

జర్మనీలో జరిగిన హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, లక్ష్యసేన్ విజేతలుగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు. మహిళల సింగిల్స్ లో సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ ప్రత్యర్ధులను చిత్తు చేసి టైటిల్స్ కైవసం చేసుకున్నారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ టోర్నీలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇద్దరు భారత క్రీడాకారులు దేశం గర్వించేలా అపూర్వ విజయాన్ని సాధించారని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.