క్యాన్సర్‌తో ప్రముఖ నటి నకామురా యూరి కన్నుమూత
రిపోర్టర్: అశోక్
స్థలం: World
ప్రముఖ జపనీస్-కొరియన్ నటి నకామురా యూరి క్యాన్సర్‌తో పోరాడుతూ సెప్టెంబర్ 1న తుదిశ్వాస విడిచారు. గత 13 ఏళ్లుగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆమె ఏజెన్సీ అల్ఫా ఏజెన్సీ ధ్రువీకరించింది. 'రోమాంటిక్స్ అనానిమస్' వంటి నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.