ఆరోగ్యానికి ఎండ చాలా ముఖ్యం: షుగర్ లెవల్స్ను నియంత్రించడంలో సూర్యరశ్మి కీలకమని శాస్త్రవేత్తల వెల్లడి

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

పగటిపూట తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. అమల రావుల అనే నిపుణురాలు తెలిపిన వివరాల ప్రకారం, చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల టైప్ 2 డయాబెటిస్ బాధితుల్ లో చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎక్కువసేపు ఎండలో గడపడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవడంతో పాటు ఊబకాయం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు.