ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు

రిపోర్టర్: మహేష్ స్థలం: India

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఆమె కొనియాడారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరించుకుంటూ, ఆధునిక బోధనా పద్ధతులను అందిపుచ్చుకుని, విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రేపు 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్రపతి సత్కరించనున్నారు.