జూబ్లీహిల్స్ పబ్‌లో ఎంపీ సోదరుడి వీరంగం, ఘర్షణ!
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కారా కారా పబ్‌లో అర్ధరాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సోదరుడు అరవింద్ యాదవ్ పబ్‌లో రచ్చ చేయడంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమయం దాటి పబ్ నిర్వహించినందుకు యాజమాన్యంపై కూడా మరో కేసు నమోదు చేసి సీసీటీవీ फुటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.