నవీ ముంబైలో నకిలీ వైద్యుడు అరెస్ట్.

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: మహారాష్ట్ర

నవీ ముంబైలోని పన్వెల్ తాలూకాలో నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసల్ఖండ్ గ్రామంలో ఎటువంటి అర్హత లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్న నూరుల్ హుడా ఇమాముల్ హక్ అనే వ్యక్తిని వైద్యాధికారుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి భారీగా మందులు స్వాధీనం చేసుకుని, మహారాష్ట్ర వైద్యుల చట్టం కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.