ఫ్లాష్ సర్వేలో సర్కార్‌పై సానుకూలత, బీఆర్‌ఎస్ తీరుపై ప్రజల ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాలనపై ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో సానుకూలత వ్యక్తమైందని తెలిపారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీరును ప్రజలు తీవ్రంగా తప్పుబట్టారని సర్వేలో తేలిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు.