పాకిస్తాన్‌లోని మసీదు వద్ద ఘోర పేలుడు పదైదు మంది మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: Pakistan

పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ కోహాట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఘోర ఆత్మాహుతి పేలుడులో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో మసీదు గేటును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బందితో సహా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.