దీపావళి రద్దీకి చెక్: చర్లపల్లి - చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

దీపావళి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా చర్లపల్లి నుంచి చెన్నై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. నవంబర్ ఆరు మరియు ఏడు తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రధాన స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని తెలిపారు.