పాలాస గడ్డపై వైఎస్సార్సీపీ నాయకుల భారీ సమీకరణ
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గ కేవీఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిశీలకులు యెన్ని ధనుంజయరావు, సాడి శ్యాంప్రసాద్రెడ్డితో పాటు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.