ప్రయాగ్రాజ్ లో విషాదం: నీట్ పరీక్షలో ఫెయిలయ్యానని యువతి ఆత్మహత్య

రిపోర్టర్: రాము స్థలం: Prayagraj

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ జిల్లాలో నీట్ పరీక్షలో విఫలమయ్యాననే మనోవేదనతో పద్దెనిమిదేళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఝున్సి పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రివేణీపురం ప్రాంతానికి చెందిన ఆ యువతి తన తండ్రికి చెందిన లైసెన్సెడ్ రివాల్వర్ తో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు డీసీపీ సాగర్ జైన్ వెల్లడించారు. తాను నీట్ పరీక్ష పాస్ కాలేనని, క్షమించాలంటూ ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.