కేసీఆర్ రాజీనామా డిమాండ్ కాంగ్రెస్‌పైకి రివర్స్!
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: తెలంగాణ
కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ నినాదం బెడిసికొట్టింది. వంద రోజుల్లో హామీలు అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన ధర్నా అస్త్రం రివర్స్ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచీ రాజీనామాలు కేసీఆర్‌కు కొత్త కాదని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.