దండారి సంబరంలో ఆదివాసీలతో కలిసి చిందేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాయికుంట గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని గ్రామస్తులతో కలిసి సందడి చేశారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలను వీక్షించి వారిని అభినందించారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.