నియోజకవర్గంలో పేదల ఖాతాల్లోకి నాలుగు కోట్లకు పైగా సహాయం

రిపోర్టర్: సురేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో గత రెండున్నరేళ్లలో నియోజకవర్గం నుంచి వచ్చిన 592 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 480 మందికి రూ.4.81 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.