టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ, త్వరలో కొత్త జీసీసీ పాలసీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
తెలంగాణలో టైర్-2 నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆదిలాబాద్ ఐటీ హబ్ ప్రారంభిస్తామని, రాష్ట్రంలో నూతన జీసీసీ పాలసీ తెచ్చి మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని స్పష్టం చేశారు.