'నిజాంను కీర్తించడం అమరవీరులను అవమానించడమే': బండి సంజయ్ ఫైర్
రిపోర్టర్: రమేష్
స్థలం: తెలంగాణ
నిజాం నిరంకుశ పాలనను కీర్తించడం తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో నిజాం రాక్షస పాలన నుండి స్వేచ్ఛ సాధిస్తే, కొందరు నేతలు నిజాంను గొప్పగా కీర్తించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల, వీర బైరాన్‌పల్లిలో జరిగిన పోరాటం ఎవరికి వ్యతిరేకంగా సాగిందో చెప్పాలని బండి సంజయ్ కుమార్ తీవ్రంగా నిలదీశారు.