తెలంగాణలో అందుబాటులోకి రెండు వందల యాభై నాలుగు జన కేంద్రాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: Telangana

తెలంగాణ వ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవలను పేదలకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన పథకం కింద రాష్ట్రంలో రెండు వందల యాభై నాలుగు జన ఔషధి కేంద్రాలు విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులతో పాటు రూ.1 కే శానిటరీ నాప్‌కిన్లు అందిస్తూ ప్రజలకు వైద్య భారాన్ని తగ్గిస్తున్నాయి.