తుపాను ధాటికి మొక్కజొన్న తోటలు నేలమట్టమై కన్నీరుమున్నీరవుతున్న కొయ్యూరు రైతు
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: కొయ్యూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కన్నవరం గ్రామంలో అర్నబ్ తుపాన్ ప్రభావంతో నాలుగు ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతు మర్రి భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పంట కోసం లక్షా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టానని, తుపాన్ కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకుని ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.