ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య పెద్ద అడ్డంకిగా మారింది
రిపోర్టర్: p.g. murthy
స్థలం: జన్నారం
జన్నారం మండలంలో మంజూరైన రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సమస్య ప్రధాన అడ్డంకిగా మారింది. మొదటి విడతలో 757 ఇళ్లు మంజూరు కాగా, ఎకో జోన్ నిబంధనలతో ఇసుక లభించక లక్ష్యం నెరవేరలేదు. తాజాగా రెండో విడతలో 332 ఇళ్లు కేటాయించారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన జీవో జారీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి ఇసుక కొరతను నివారించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.