నా పేరును దుర్వినియోగం చేస్తే ఉపేక్షించేది లేదు: ఎమ్మెల్యే చింతమనేని హెచ్చరిక
రిపోర్టర్: మహేష్
స్థలం: కృష్ణా
కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెదురుపావులూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన వివాదంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. పోలీసుల భయంతో తమ లారీలు ఎమ్మెల్యే అవేనంటూ డ్రైవర్లు తప్పుడు ప్రచారం చేశారని తేలింది. ఈ నేపథ్యంలో తన పేరును అడ్డం పెట్టుకుని లబ్ధి పొందాలని చూస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.