వైద్య విద్యార్థులకు ప్రత్యేక స్టైఫండ్ పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం

రిపోర్టర్: శివ స్థలం: కోనసీమ

రాష్ట్రంలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అమలాపురం ఎంపీ, టీడీపీ విప్ గంటి హరీష్ మాధుర్ తెలిపారు. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంపు కోసం అదనంగా రూ.34.08 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇంటర్న్లకు 10 శాతం, పీజీ, ఎండీ, డీఎన్బీలకు 5 శాతం అలాగే సూపర్ స్పెషాలిటీ కోర్సులకు 3.5 శాతం స్టైఫండ్ పెంచడం ద్వారా వైద్య విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.