రెండు వేల ముప్పై నాటికి భారత్ లో అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ

రిపోర్టర్: శివ స్థలం: ఇండియా

భారత్‌లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను బలోపేతం చేయడానికి మైక్రోసాఫ్ట్ కట్టుబడి ఉందని ఆ సంస్థ ఛైర్మన్ సత్య నాదెళ్ల తెలిపారు. యూఎస్‌లోని సియాటిల్‌లో జరిగిన ఇండియన్ అమెరికన్ టెక్ సీఈఓస్ ఫోరమ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత రాయబారి వినయ్ క్వాత్రా తో పాటు వివిధ ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు.