మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న హీరో నాని
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలను ప్యారడైజ్ చిత్ర బృందం మంగళవారం దర్శించుకుంది. ప్రముఖ హీరో నాని, నటుడు సంపూర్ణేశ్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సినిమాలో హీరో తల్లి పాత్రకు సమ్మక్క పేరు పెట్టడం, ఆ పాటకు మంచి ఆదరణ లభించడంతో వనదేవతలను దర్శించుకున్నట్లు తెలిపారు. హీరో నానిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.