క్యాన్సర్ రోగులకు భారీ ఊరట: ఔషధాల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
రిపోర్టర్: మహేష్
స్థలం: న్యూఢిల్లీ
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వేలాది మంది రోగులకు ఆర్థిక భారం తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నాన్-షెడ్యూల్డ్ విభాగంలోని క్యాన్సర్ మందుల విక్రయ ధరపై ట్రేడ్ మార్జిన్‌ను కేవలం ముప్పై శాతానికి పరిమితం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా అత్యంత ఖరీదైన ఔషధాల ధరలు గరిష్ఠంగా డెబ్బై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.