నగరిలో భక్తిశ్రద్ధలతో శ్రమదానం: ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసిన భక్తులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

చిత్తూరు జిల్లా నగరి పుదుపేటలోని ఆలయ ప్రాంగణంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓంశక్తి భక్తులు, ఆధ్యాత్మిక ప్రజాసేవా కార్యకర్తలు ఘనంగా శ్రమదానం నిర్వహించారు. సంస్థ రాష్ట్ర కార్యదర్శి వి.టి. భాస్కర్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆలయ పరిసరాలు, విగ్రహాలపై ఉన్న వ్యర్థాలను శుభ్రం చేశారు. ప్రజాసేవతో కూడిన భక్తిని చాటుకున్న ప్రతి ఒక్కరికీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయాల పరిశుభ్రతకు అందరూ కలిసికట్టుగా నడుం బిగించాలని స్థానిక నేతలు స్పష్టంగా పిలుపునిచ్చారు.