వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ప్రకటించిన సీఎం రేవంత్

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

వినాయక చవితి పండగను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.