'నిమజ్జనానికి పటిష్ట భద్రత.. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా': పోలీసు శాఖ వెల్లడి
రిపోర్టర్: సురేష్
స్థలం: Andhra Pradesh
జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్లు మరియు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.